Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెజాన్‌ ప్యాకేజీలో పాము.. కంగుతిన్న బెంగ‌ళూరు జంట‌.. ఇదిగో వీడియో!

Bengaluru couple finds cobra in Amazon package
Advertisement
  • అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోల‌ర్ ఆర్డ‌ర్ చేసిన బెంగ‌ళూరు జంట‌
  • ప్యాకేజీలో వ‌చ్చిన‌ విష‌పూరిత పాము
  • తమకు ఎదురైన వింత అనుభవాన్ని నెటిజ‌న్ల‌తో పంచుకున్న క‌పుల్‌
  • వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన అమెజాన్‌
Advertisement
అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోల‌ర్ ఆర్డ‌ర్ చేసిన బెంగ‌ళూరు సాఫ్ట్‌వేర్ జంట‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ఆ ప్యాకేజీలో విష‌పూరిత పాము వ‌చ్చింది. ఆ పామును చూసి జంట కంగుతింది. దీంతో ఈ ఆర్డ‌ర్ తాలూకు ఆన్‌బాక్సింగ్ వీడియోను ఆ క‌పుల్‌ సోష‌ల్ మీడియాలో పెట్టింది. తమకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.  

వివ‌రాల్లోకి వెళ్తే.. బెంగళూర్‌లోని స‌ర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. పార్శిల్ మంగళవారం వచ్చింది. దాంతో ప్యాకేజీని ఓపెన్ చేసే స‌మ‌యంలో వీడియో తీశారు. అలా బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో వారికి పాము క‌నిపించింది. అది విషస‌ర్పం కావడంతో భయాందోళనలకు గురయ్యారు.

అయితే, ఆ పాము టేపుకు అతుక్కొని ఉంది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయారు. వెంటనే ఈ విష‌యాన్ని అమెజాన్ కస్టమర్ కేర్ సపోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పరిస్థితి చెప్పినప్పటికీ రెండు గంటల పాటు వెయిట్ చేయించారని ఆ జంట మండిప‌డింది. ఆ తర్వాత ఆర్డర్‌కు సంబంధించి నగదు మొత్తం రీఫండ్ చేశారట‌. విష స‌ర్పం రావడం ఆందోళన కలిగించింద‌ని, తమ భద్రత సంగతి ఏంటని వారు వాపోయారు. అమెజాన్‌లో వస్తువుల నిల్వ చోట సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదా? సరైన రవాణా జరగడం లేదా? అని ఆ జంట మండిపంది. 

ఈ ఘటనపై స్పందించిన అమెజాన్.. ఆ క‌పుల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామ‌ని, ఆ ఆర్డర్‌కి సంబంధించి అసలు ఏం జరిగిందో పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. అయితే, సేఫ్టీపై సంస్థ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేద‌ని ఆ జంట అసంతృప్తి వ్య‌క్తం చేసింది.
Advertisement
Advertisement
Amazon package
Bengaluru
Cobra

More Telugu News